మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ – విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్

రోడ్డుపై ఉన్న చెత్తను స్వయంగా తొలగిస్తున్న కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్

మొక్కలు నాటి వాటి పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. విజయనగరం రూరల్ మండల పరిధిలోని చెల్లూరు నుంచి రాజపులోవ వెళ్లే జాతీయ రహదారిపై డివైడర్లు, రోడ్డుకు ఇరువైపులా హరిత విజయనగరం ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డు డివైడర్లు, ఇరువైపులా ఉన్న చెత్తను కలెక్టర్ స్వయంగా తొలగించి మొక్కలు నాటడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గ్రామ, ఇళ్లు, రోడ్లు పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గిస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో హరిత విజయనగరం సభ్యులు, గ్రామ వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నరు.