రేపు సరూర్‌నగర్‌ స్టేడియం పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డు నుంచి సరూర్‌నగర్‌ స్టేడియం వరకు ర్యాలీ, ఆ తరువాత స్టేడియం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఈ నేపధ్యంలో ర్యాలీలు, సభ జరిగే సమయంలో స్టేడియం పరిసరాలలో ట్రాఫిక్‌ రద్దీ ఉంటుందని, దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలుంటాయని సీపీ తెలిపారు. ఆ సమయంలో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లి వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సీపీ సూచించారు.