గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన రష్మీ, జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ ఈ రోజు నానాక్ రాంగూడలోని తన నివాసంలో మొక్కలు నాటారు. మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్ ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. అంతేకాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి. ఇలా మనకి ఎన్నో ఉపయోగాలున్నాయి. మనస్సుంటే మొక్కలు నాటడానికి ఖాళీ స్థలం లేదనే ప్రసక్తి లేదు. మొక్కలు నాటి రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను, వాతావరణంలో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలి. అందుకే నేను నాటాను కదా నాతో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆగకుండా మరో ముగ్గురిని యాక్టర్ సత్యదేవ్, ప్రియమైన మిత్రురాలు అనసూయ మరియు శేఖర్ మాస్టర్ ని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించాలి అని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన రష్మీ ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.