అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలుగు రాష్ట్రాల మహిళలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ప్రతి మహిళా అన్ని రంగాల్లో సమానత్వం సాధించాలని అభిలషించారు. అన్ని రంగాల్లోనూ మహిళలు పురోగమించాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగానూ మహిళలు సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.