
ఆంధ్రప్రదేశ్రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్ పదవులకు ఏపీ ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శ్రీకాకుళం – బీసీ మహిళ, విజయనగరం – బీసీ మహిళ, విశాఖపట్నం – బీసీ జనరల్, రాజమండ్రి – జనరల్, కాకినాడ -జనరల్ మహిళ, ఏలూరు – జనరల్ మహిళ, విజయవాడ – జనరల్ మహిళ, మచిలీపట్నం – జనరల్ మహిళ, గుంటూరు – జనరల్, ఒంగోలు – ఎస్సీ మహిళ, నెల్లూరు – ఎస్టీ జనరల్, తిరుపతి – జనరల్ మహిళ, చిత్తూరు – ఎస్సీ జనరల్, కడప – బీసీ జనరల్, అనంతపురం-జనరల్, కర్నూలు-బీసీ జనరల్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.