ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఖైరతాబాద్‌లో గల ఆర్యవైశ్య భవన్‌లో ఆయన విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మారుతీరావు నిన్న రాత్రి ఆర్యవైశ్య భవన్‌లో గది అద్దెకు తీసుకుని బస చేశాడు. మారుతీరావు స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. కూతురు అమృతను ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ని హత్య చేయించినట్లు మారుతీరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీడీ యాక్టు కేసులో అరెస్టై ఆరు నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. పోలీసుల ఒత్తిళ్ల వల్లే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని ప్రణయ్‌ను మారుతీరావు కిరాయిహంతక ముఠాతో హత్యచేయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.