
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ పరిమల్ నత్వాని ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ విజ్ఞప్తి మేరకు పరిమల్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పెద్దల సభకు నామినేట్ చేసిందుకు సీఎం జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిమల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఏపీ ప్రజలకు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తాను’ అని పోస్ట్ చేశారు.