ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నావంతు సేవ చేస్తా : అయోధ్య రామిరెడ్డి

తనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకం ఉంచినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర వాణి వినిపిస్తానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి సీఎం వైఎస్‌ జగన్‌ అవకాశం కల్పించారని అన్నారు. తన సామర్థ్యాన్ని నిరూపించుకుని ప్రజలకు మేలు చేస్తానని తెలిపారు.