
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ దేశ ప్రజల్లో సంతోషం తీసుకువస్తుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంగుల్లో యూత్ మునిగితేలుతున్నారు.