కాంగ్రెస్‌కు మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాజీనామా లేఖను కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. అంతకుముందు సింధియా.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.