రాజీవ్‌ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీ

రాజీవ్‌ స్వగృహ ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కమిటీని ఏర్పాటు చేశారు. గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ అధ్యక్షతన ఆర్థిక, పురపాలకశాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. బండ్లగూడ, పోచారంలోని ప్లాట్లు, ఆస్తుల అమ్మకంపై కార్యదర్శుల కమిటీ విధివిధానాలు ఖరారు చేయనుంది.