
ప్రస్తుతం తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇవాళ కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో మంత్రి ఈటెల సమావేశమయ్యారు. అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌తో మాట్లాడాను. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రతీ ప్రయాణికుడిని స్క్రీనింగ్ చేస్తున్నామని తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. రేపు మరోసారి దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహిస్తాం. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా నయమైంది. ఉస్మానియా ఆస్పత్రిలో కూడా కరోనా పరీక్షలు చేస్తున్నాం. ప్రతీ జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.