
హైదరాబాద్ నగరంలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సులలో శిక్షణ పొందుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్, రిటైర్ సేల్స్ అసోసియేట్, క్యాషియర్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, టాలీ, అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని, పూర్తిగా రెసిడెన్షియల్ సదుపాయం ఉంటుందన్నారు. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, స్టడీ సర్టిఫికెట్ జిరాక్స్ ప్రతులను జత చేసి ఎస్సీ కార్యాలయంనందు (కలెక్టరేట్ కాంప్లెక్స్) సమర్పించాలన్నారు. దరఖాస్తుకు గడువు ఈ నెల 17వ తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.