ఖమ్మం లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య

ఖమ్మం లేబర్‌ ఆఫీసర్‌ ఆనంద్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆనంద్‌రెడ్డి.. భూపాలపల్లి జిల్లా గోళ్లబుద్ధరం అడవులల్లో హత్యకు గురయినట్టు పోలీసులు గుర్తించారు. ఆనంద్‌రెడ్డిని సీఐ ప్రశాంత్‌రెడ్డి సోదరుడు ప్రదీప్‌రెడ్డి హత్యచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా తెలుస్తోంది.