
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.