
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియామకం అయ్యారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమైన సంజయ్ కుమార్‌కు రాష్ట్ర బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ కొనసాగుతున్న విషయం విదితమే.