బీజేపీతో చేరిన కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా

కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా సమక్షంలో సింధియా కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సింధియాకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిన్న సాయంత్రమే సింధియా బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ ఇవాళ ఆయన బీజేపీలో చేరారు.