జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఐఏఎస్ కలెక్టరేట్ ఆవరణంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్విట్టర్ వేదికగా గ్రీన్ ఛాలెంజ్ ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మొక్కలు నాటి సంరక్షించే అలవాటు చేసుకోవాలి అప్పుడే మన పర్యావరణ పరిరక్షణకి మనం మేలు చేసిన వాళ్లం అవుతాము. ఈ గ్రీన్ చాలెంజ్ ప్రతి ఒక్కరికి అలవాటు అయ్యే విధంగా ఈ గ్రీన్ చాలెంజ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలాగా మన వంతు బాధ్యతగా పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్నారు.

