రాజ్య సభ్యులు సంతోష కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో బాగంగా భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు విసిరిన గ్రీన్ చాలెంజ్ ని స్వీకరించిన భూపాలపల్లి ఆర్.టి.సి డిపో మేనేజర్ లక్ష్మి ధర్మ మొక్కలు నాటి భూపాలపల్లి ఎస్.బి.ఐ. బ్యాంక్ మేనేజర్ దీపక్, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్, వరంగల్ ఆర్టీసీ డిపో 2 మేనేజర్ బానుకిరణ్. ఈముగ్గురికి గ్రీన్ చాలెంజ్ విసిరినారు.
ఈ సందర్భంగా డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నాకు భూపాలపల్లి డీఎస్పీ ఈ గ్రీన్ ఛాలెంజ్ వేయడం జరిగింది. ఈ రోజు నేను ఒక మొక్క నాటడం జరిగింది. అలాగే నేను కూడా ఒక ముగ్గురికి మొక్కలు నాటాలని నామినేట్ చేయడం జరిగింది. భూపాలపల్లి ఎస్.బి.ఐ బ్యాంక్ మేనేజర్, బస్ డిపో మేనేజర్, మత్స్యశాఖ జిల్లా అధికారి భాస్కర్. వరంగల్ ఆర్.టి.సి-2 డిపో భాను కిరణ్ కి గ్రీన్ చాలెంజ్ విసరడం జరిగింది. గ్రీన్ చాలెంజ్ అనేది ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. బాధ్యత గల ప్రతి పౌరుడు వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు.