లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వక్ఫ్‌బోర్డు జూనియర్ అసిస్టెంట్ అజహర్ ఖాన్

రాష్ట వక్ఫ్‌బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అజహర్ ఖాన్ రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. మలక్‌పేట్‌లోని ఓ మసీద్‌కు సంబంధించిన సమాచారం కావాలంటూ ఆర్‌టిఐ సయ్యద్ మెహినుద్దీన్ జూనియర్ అసిస్టెంట్ అజహర్ ఖాన్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ సమాచారం ఇవ్వాలంటే ఐదు వేల రూపాయల లంచం ఇవ్వాలని అజహర్ ఖాన్ సయ్యద్ మెహినుద్దీన్‌ను డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని బాధితుడు మోహినుద్దీన్ ప్రాధేయపడ్డాడు వెయ్యి తగ్గించి నాలుగు వేల రూపాయలకు వారి మధ్య అంగీకారం కుదిరింది. ఈ క్రమంలో బాధితుడు సయ్యద్ మెహినుద్దీన్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ.4 వేల లంచం ఇస్తుండగా, అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి అజహర్ ఖాన్‌ను పట్టుకున్నారు. ఈ సందర్భంగా నగదును స్వాధీనం చేసుకుని, అజహర్ ఖాన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.