ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం…

సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. బస్సు ముంబయి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.