
నల్లమల అటవీప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ… ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భాగంగా సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు అక్కడ కాటేజీలను నిర్మించినట్లు వెల్లడించారు. మల్లెలతీర్థానికి రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నల్లమలలోని ఆధ్యాత్మిక ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని అదేవిధంగా సందర్శించే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.