
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ సోకిన వ్యక్తిని వైద్యులు డిశ్చార్జ్  చేశారు.  మహేంద్రహిల్స్‌కు చెందిన వ్యక్తికి తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా నెగెటివ్ రావడంతో పాటు పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి పంపించారు. మార్చి 1న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో 15 రోజుల పాటు అతనికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించారు.14 రోజులు హోమ్ ఐసోలేషన్ వార్డులో ఉండాలని వైద్యులు సూచించారు. 
కరోనా వైరస్ సోకిన వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం హర్షణీయమని  మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ లేదని మంత్రి స్పష్టం చేశారు.  శుక్రవారం సాయంత్రం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా లక్షణాలు  ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.