ఎంపీ రేవంత్‌రెడ్డి చేసింది తప్పే: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

ఎంపీ రేవంత్‌రెడ్డి 111 జీవో పై మెచ్యూరిటీ లేకుండా వ్యవహరించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ… గోపన్‌పల్లి భూముల వ్యవహారంలో తప్పు జరగకుంటే ఆధారాలు బయటపెడితే అయిపోయేది. ఆ పని చేయకుండా కేటీఆర్‌ పామ్‌హౌస్‌ దగ్గర హడావిడి చేయడం రేవంత్‌రెడ్డి తప్పేనన్నారు. చీప్‌ పాలిటిక్స్‌ మంచిది కాదు. రేవంత్‌ మిత్రుడే… కాని మొన్న చేసింది మంచిది కాదన్నారు. పీసీసీ అధ్యక్షుడు అవ్వడానికి అన్ని అర్హతలు నాకున్నాయి. నా తరువాతే ఇంకా ఎవరైనా. పీసీసీ అధ్యక్ష పదవి కోసం కొట్లాడుతాం. పీసీసీ అధ్యక్షుడు కావడానికి డబ్బు ఒకటే ప్రామాణికం కాదు. అందరినీ కలుపుకుని పోయే స్వభావం కూడా ఉండాలని తెలిపారు.