గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ భాస్కర్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా SUNSHINE హాస్పిటల్ చైర్మన్ గురువారెడ్డి ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఆవరణంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మూడు మొక్కలు నాటిన కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ భాస్కర్ రావు.
ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని దీని వలన పచ్చదనం పెరిగి వాతావరణ కాలుష్యం తగ్గుతుందని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా మాలాంటి కార్పొరేట్ సంస్థల వారం కూడ సామాజిక బాధ్యతగా CSR డబ్బు నుండి కూడా కొంత డబ్బులను చెట్లను పెంచడం కోసం పార్కుల అభివృద్ధి కోసం ఇస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మరొక ముగ్గుర్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 1) శీనయ్య MD BSCPLకంపెనీ 2) రాజేశ్వరరావు; మాజీ కమిషనర్ ఇన్కమ్ టాక్స్ 3) లక్ష్మా రెడ్డి ఎమ్మెల్యే జడ్చర్ల, మాజీ ఆరోగ్య శాఖ మంత్రిలను మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్; హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.