ప్రగతి భవన్ లో కరోనా పై సీఎం కేసీఆర్ మీడియా సమావేశం

ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన దగ్గర వ్యాధి ఉంది, భయంకరమైన పరిస్థితి ఉంది, అనే పరిస్థితి లేదు.
ప్రజలు భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇది మన దేశంలో పుట్టిన వ్యాధి కాదు. ఎక్కడో చైనా దేశంలో పుట్టి అది వ్యాపిస్తుంది. మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే తప్ప, ఇక్కడ ఉన్నవారిని ఎవరికీ వ్యాధి సోకలేదు. ఇతర దేశాల పర్యటనకు వెళ్లిన బెంగళూరు వ్యక్తికి వ్యాధి సోకడంతో అతనికి మన వైద్యలు చికిత్స చేశారు. అతను పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్‌ కూడా చేశారు. ఇప్పటి వరకు మన దేశంలో 83 మంది ఈ వ్యాధికి గురయ్యారు. ఇందులో 66 మంది భారతీయులు, 17 మంది విదేశీయులు ఉన్నారు. వీరంతా విదేశీ పర్యటనకు వెళితే అక్కడ వైరస్‌ ప్రభావానికి గురయ్యారు. ఇందులో 10 మంది ఇప్పటికే కోలుకున్నారు. ఒక ఇద్దరు మాత్రమే వైరస్‌ ప్రభావంతో మృతి చెందారు.
130 కోట్ల జనాభాలో 83 మందికి మాత్రమే వ్యాధి సోకింది. వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే. దానికి బయపడాల్సిన పనిలేదు. అయిన కూడా అది ఒకరి నుంచి మరొకరికి పాకే వైరస్‌ కావడంతో ముందు జాగ్రాత్త చర్యల్లో భాగంగా మనలను మనం కాపాడుకోవాలంటే ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు పోవద్దని సూచించారు. ఇప్పటికే మన పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాలు కొన్ని చర్యలు తీసుకున్నారు. మన ప్రభుత్వం, ఆరోగ్య శాఖ కూడా వైరస్‌ను ఎదుర్కోవడానికి సర్వ సన్నద్దంగా ఉంది. ప్రాథమికంగా దీని కోసం రూ.500 కోట్లు కేటాయిస్తు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిధి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధిలో ఉంటాయి.
విమానాశ్రయంలో 200 మంది ఆరోగ్యశాఖకు చెందిన సిబ్బంది విదేశాల నుంచి వచ్చే వారిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు సిద్ధం కావడం సాధ్యం కాదు కాబట్టి అన్ని జిల్లాల్లో ఐసోలేటెడ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. 321 ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌ బెడ్స్‌ కూడా సిద్ధంగా ఉంచాం. అన్ని కలిసి 1340 బెడ్స్‌ను రెడీగా పెట్టుకున్నాం. మార్చి 31వ తేదీ వరకు జనసామర్థ్యం ఎక్కువ ఉండకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా అన్ని రకాల విద్యాసంస్థలు, ప్రైమరీ స్కూల్స్‌ టూ యూనివర్సిటీ వరకు మూసివేయాలని నిర్ణయించాం.

మార్చి 31 వరకు విద్యాసంస్థలు మూసివేత
మార్చి 31వ తేదీ వరకు జనసామర్థ్యం ఎక్కువ ఉండకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా అన్ని రకాల విద్యాసంస్థలు, ప్రైమరీ స్కూల్స్‌ టూ యూనివర్సిటీ వరకు మూసివేయాలని నిర్ణయించాం. ఎవ్వరు కూడా ఈ నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. సెలవులు ఇవ్వకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తే వాటి అనుమతులు వాటి రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ సోషల్‌ వెల్‌ఫేర్‌ హాస్టల్స్‌లో, కాలేజీ హాస్టల్స్‌ ఉంటున్న పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు వసతి ఉంటుంది. మిగితా విద్యార్థులను ఇంటికి పంపించడం జరుగుతుందని తెలిపారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ప్రత్యేక సానిటరీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆ శాఖ అధికారులకు ఆదేశించాం. ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైన పదోతరగతి పరీక్షలు, ఇప్పుడు నడుస్తున్న ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తాయని తెలిపారు.

పెండ్లీలకు బంధువులను తక్కువగా పిలవండి.. సీఎం కేసీఆర్‌
జనం ఎక్కవ గుమికూడేది పెండ్లీలు, ఫంక్షన్లలోనే. మ్యారేజ్‌ హాల్స్‌ అన్ని మూసివేయాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటికే నిర్ణయించబడ్డ పెండ్లీలు చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నాం. బంధువులను మాత్రం 200 లోపు ఉండేలా నియంత్రించుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మార్చి 31 తరువాత జరగబోయే పెండ్లీలకు మాత్రం ఫంక్షన్‌ హాల్స్‌ బుకింగ్‌ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వాటి అనుమతులు రద్దు చేస్తామన్నారు. వీటిని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీలకు, కలెక్టర్లకు అధికారాలు ఇచ్చామన్నారు.

సినిమాహాల్స్‌, బార్స్‌, పబ్‌లు బంద్‌
రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగసభలు, సమావేశాలు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్‌లకు అనుమతి ఇచ్చేది లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సినిమాహాల్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌ చేస్తున్నాం. రాష్ట్రంలో జరగాల్సిన అన్ని రకాల స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ను రద్దు చేస్తున్నాం. ట్రేడ్‌ ఫేర్స్‌, కల్చరల్‌ ఈవెంట్స్‌లకు అనుమతి ఇవ్వబడదు. ఇండోర్‌, ఔట్‌డోర్‌ స్పోర్ట్స్‌ స్డేడియాలు, రాష్ట్ర వ్యాప్తంగా స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జిమ్‌లు, జిమ్నాజియమ్స్‌, జూ పార్కులు, అమ్యూజ్మెంట్‌ పార్కులు, మ్యూజియమ్స్‌ మూసివేస్తున్నాం. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, షాపింగ్‌ మాల్స్‌ యథాతథంగా నడుస్తాయని ప్రకటించారు.

వైరస్‌ను ఎదుర్కోనేందుకు సర్వంసిద్దం: సీఎం కేసీఆర్‌
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వైరస్‌ను ఎదుర్కోవడానికి సర్వ సన్నద్దంగా ఉందని. ప్రాథమికంగా దీని కోసం రూ.500 కోట్లు కేటాయిస్తు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిధి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధిలో ఉంటాయి. విమానాశ్రయంలో సర్వైలెన్స్‌ ఏర్పాటు చేశాం. 200 మంది ఆరోగ్యశాఖకు చెందిన సిబ్బంది విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు సిద్ధం కావడం సాధ్యం కాదు కాబట్టి అన్ని జిల్లాల్లో ఐసోలేటెడ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. 321 ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌ బెడ్స్‌ కూడా సిద్ధంగా ఉంచాం. 240 వెంటిలేటర్స్‌ సిద్దంగా ఉన్నాయి.రాష్ట్రంలో 4 క్వారంటైస్‌ ఫెసిలిటీస్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం. వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, పోలీస్‌శాఖల అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామన్నారు.