కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే.. ఏడాది జైలు -హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన సృష్టిస్తుందని ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తే వారిపై ఎన్‌డీఎమ్‌ఏ యాక్ట్‌ సెక్షన్‌ 54 కింద కేసును నమోదు చేస్తామన్నారు. ఈ సెక్షన్‌ కింద దాదాపు ఏడాది జైలు, జరిమానా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.