గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండలోని తన నివాసంలో మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి.
ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహరము స్పూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.నాకు మొక్కలన్న, చెట్లన్న చాలా ఇష్టమని ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడం చాలా సంతోషానిస్తుందని రామజోగయ్య శాస్త్రి అన్నారు. పర్యావరణానికి మొక్కలు ఎంతగానో మేలు చేస్తాయని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసారు.ఈ గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా సినీ కవి చంద్రబోస్, సంగీత దర్శకులు థమన్, సినీ హీరో రాజ్ తరుణ్ మొక్కలు నాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి,హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నిర్వాహకులు సుబ్బరాజు పాల్గొన్నారు..