లారీని ఢీకొట్టిన వ్యాన్‌: ముగ్గురు మృతి

నార్సింగి మండల కేంద్రం సమీపంలో 44 వ జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని ఓమ్నీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన అంజి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట్ మండలం దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన ఈరవేని కృష్ణ, డ్రైవర్ కిష్టయ్యలున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ కావ్య, అజయ్ ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాచారెడ్డికి చెందిన రవి అనే వ్యక్తిని దుబాయ్ కు పంపించడానికి హైదరాబాద్ లోని శంషాబాద్ విమాన శ్రయానికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది.