
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాల్సిందిగా సినీ నటుడు మహేశ్ బాబు కోరారు. ట్విట్టర్ ద్వారా మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఇది కష్ట కాలమన్నారు. అయినా మనం దాన్ని ఆచరించి చూపిద్దామన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇదన్నారు. వీలనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండాల్సిందిగా ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన ఆరు సూత్రాలు పాటిస్తే కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.