ఏసీబీకి చిక్కిన జూనియర్ ఆడిట్ ఆఫీసర్
రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ పెన్షన్ ఫైల్ విషయంలో రూ.3వేలు లంచం డిమాండ్ చేసిన జూనియర్ ఆడిట్ ఆఫీసర్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే… కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించిన ముజాహిద్ హుస్సేన్ 2019 డిసెంబర్ 31వ తేదీన రిటైర్డ్ అయ్యాడు. కాగా, ఆయన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పింఛన్ మంజూరుకు రూ.3వేలు లంచంగా ఇవ్వాలని జూనియర్ ఆడిట్ ఆఫీసర్ జైనలాబుద్దీన్‌ను డిమాండ్ చేశాడు. దీనిపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు జైనలాబుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. లంచం తీసుకోవడం, లంచం ఇవ్వడం రెండూ నేరమేనని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.