రాష్ట్రంలో 24 గంటలపాటు జనతా కర్ఫ్యూ : సీఎం కేసీఆర్‌

కరోన వైరస్ సంబంధించి కొంచం ముందుగానే అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పడ్డాం
విదేశాల నుండి వచ్చే వారి నుండి ఈ వైరస్ వచ్చింది, దాదాపు 20 వేల వరకు విదేశాల నుండి వచ్చారు
అందుకే మొన్న కలెక్టర్ ల సమావేశం ఏర్పాటు చేశాంఎయిర్పోర్ట్ లో అందుకే అధికారులను నియమించాం .
ఇతర రాష్ట్రాల నుండి దిగి వచ్చిన వారు డైరెక్ట్ వస్తున్నారు. మొన్న మీటింగ్ లో పోలీస్,ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చాము . దీనితో మంచి ఫలితాలు వచ్చాయి.నిఘా బృందాలు వారిని పట్టుకోవడం జరిగింది
నిఘా బృందాల ద్వారా పట్టుకున్న వారిని క్వారంటైన్ లో పెట్టి వారికి అన్ని వైద్య సేవలను ప్రభుత్వ పరంగా అందిస్తున్నాము . అనుమానం ఉన్న వారికి వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇందులో 21 మందికి పాజిటివ్ వచ్చింది .
వీళ్ళు అంతకూడా ఇతర దేశాల నుండి వచ్చిన వారే ఉన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో జాయింట్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగింది . హెల్త్ మినిస్టర్ ఆధ్వర్యంలో 5 గురు అధికారులతో ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
విదేశాల నుండి వచ్చిన వారిపై నిఘా పెట్టాం. విదేశాల నుండి వచ్చిన వారికి విజ్ఞప్తి చేస్తున్న మీరు మా బిడ్డలే కానీ ప్రభుత్వం చెప్పినట్టు వినాలి.మీకు మీరు చెప్పాలి మీరు ఇతరులకు హాని కల్గించవద్దు.దయచేసి స్వయం నియంత్రణ పాటించాలి
ఎన్నో ప్రెస్ మీట్ లు పెట్టుకున్నాం కానీ జర్నలిస్టుల మధ్య 3 ఫీట్ ల దూరం లో చైర్స్ వేశామ్ తప్పదు
మీకు మీరు వచ్చి చెప్పండి లేదంటే ఇబ్బందులు తప్పవు. మీకు వ్యాధి లక్షణాలు ఉంటే తప్ప మీకు మీరు ఇంట్లో ఉన్నా చికిత్స అందిస్తారు.
విదేశాల నుండి వచ్చిన వారికి , వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్న . స్వచ్ఛందంగా తెలుపండి మీ వల్ల సమాజం ,రాష్ట్రం, ప్రపంచం మొత్తం బాగుపడుతుంది
దగ్గు,జలుబు,జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలి. మీకు రూపాయి ఖర్చు లేకుండా మేము చికిత్స అందిస్తాం . మీకు అంబులెన్స్ వసతి కల్పిస్తాం .
మీరు రిపోర్ట్ చేయకపోతే తప్పించుకోలేరు . ఎందుకంటే 60 వేల మంది పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు చెక్ చేస్తున్నారు.
రేపు స్వయం నియంత్రణ తోని జనతా కర్ఫ్యూ పాటించాలి .రేపు ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి 6 ఉదయం వరకు అందరూ పాటించాలిమనం గొప్ప వాళ్ళం మనకు తెలుసు 60 యేండ్లు పోరాటం చేసి సాధించాం
రేపు రాష్ట్ర వ్యాప్తంగా బస్ లు బందు కానీ డిపో కు 5 బస్ లు అందుబాటులో ఉంచుతాం ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాడుకోవడం కోసం.
ఇతర రాష్ట్రాల నుండి వచ్చే బస్ లను కూడా రానివ్వంమెట్రో రైల్ ఆల్రెడీ క్లోజ్ చేశాం ,ఒక్క 5 ట్రైన్స్ సిబ్బంది సిద్ధంగా ఉంచాము . సీఎస్ ఆధ్వర్యంలో మాత్రమే ఉంటాయిమిగతా వాళ్ళు అంటే షాప్స్,మాల్స్ కూడా ఎవరికి వారు స్వచ్ఛందగా బందు చేసుకోవాలి
తెలంగాణ ఉద్యమంలో కూడా బందు చేసుకున్నాం .రేపు అందరూ బందు పెట్టాలి అని కోరుతున్నఅత్యవసర సిబ్బంది మినహా అందరూ క్లోజ్ చేసుకోవాలి24 గంటల పాటు స్వీయ నియంత్రణ పాటించాలిఈ మహమ్మరిని ఎదుర్కోవాలి అంటే ఇది చెయ్యాలిమనకు ఇబ్బంది ఏంది అంటే సమీపాన ఉన్న మహారాష్ట్ర లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది అయితే ఒక్కటి రెండు రోజుల్లో మహారాష్ట్ర బార్డర్ పూర్తి గా క్లోజ్ చేసే ఆలోచన ఉందిఅధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారుమీడియా,హెల్త్, ఎలక్ట్రిసిటీ ఇతర ఎమెర్జెన్సీ సేవలు మినహా అన్ని క్లోజ్
60 యేండ్ల వయస్సుపైబడి ,10 సంవత్సరాల లోపు పిల్లలు బయటకు రాకూడదు.ప్రధాన మంత్రి తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో నేను మన దగ్గర సిసిఎంబి ఉందని చెప్పాను . అయితే కేస్ ల సంఖ్య పెరిగితే మనకు అందులో టెస్ట్ చేయడానికి ఆర్డర్ ఇచ్చారుప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయి కాబట్టి మనం కూడా ప్రభుత్వం కు సహకరించాలి
కరోన వైరస్ కు స్వాభిమానం ఎక్కువ అది మనం ఇన్వైట్ చేస్తే తప్ప మన ఇంటికి రాదు
అందరూ కూడా రేపు 24 గంటలు బయటకు రావద్దుదేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. రేపు రేపు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయిన తట్టుకునే శక్తి తెలంగాణ ఉంది అనేలా ఉండాలిఅవసరమైతే రేషన్ కూడా ఇంటికి పంపిణీ చేయాలని చూస్తున్నాం
వైరస్ ఎదుర్కోవడం కోసం అన్ని ఏర్పాట్లలో సిద్ధంగా ఉన్నాంప్రజలను కాపాడుకోవడం కోసం ప్రభుత్వం సంసిద్దంగా ఉన్నది.వైద్య బృందాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న .వారు నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారు.వారికి మనం కూడా అండగా ఉండాలి
రేపు స్వయం నియంత్రణ చేసుకోవాలిరేవు ఇంట్లో నుండి ఎవరు రావద్దు దయచేసి ఇవ్వన్నీ పాటిస్తే కరోన మన దరికి చేరదు.
ప్రధాన మంత్రి చెప్పిన మాటలను కూడా అవహేళన చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు .నేను కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా చెప్పానుఆయన చప్పట్లు కొట్టండి అని చెప్పారు తప్పేంది దేశ ఐక్యత కోసం చెప్పారు తప్పులేదు దీన్ని కూడా కొంత మంది ఈడియట్స్ తప్పుడు పోస్ట్ లు పెడుతున్నారు వారిపై కేస్ లు బుక్ చేయమని డిజిపి కి చెప్తున్నా
నేను కూడా పీఎం చెప్పినట్లు చప్పట్లు కొడుతా మా కుటుంబం మొత్తం కొడుతారు ప్రధాన మంత్రి చెప్పినట్లు ప్రతి ఒక్కరు రేపు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాలిరేపు రాష్ట్రం నలుమూలలా సాయంత్రం 5 గంటలకు సైరన్ వచ్చేటట్లు చేశాం . ఆ టైంలో అందరూ చప్పట్లు కొట్టాలిమత ప్రచారాకులు వచ్చారు వాళ్ళను అప్పగిస్తున్నారు.వారిలో 10 మందికి పాజిటివ్ వచ్చింది వారు వైద్య బృందం ఆధ్వర్యంలో ఉన్నారు
మొహం,ముక్కు దగ్గర చేతులు పెట్టుకోవద్దు.అవసరమైతే అంత షట్ డౌన్ చేస్తాం ప్రభుత్వం ఆధ్వర్యంలో రేషన్ సప్లై చేస్తాం