
రాష్ట్రప్రజలంతా దయచేసి లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ..ప్రజలెవరూ బయట తిరుగొద్దని సూచించారు. క్యాబ్స్ బుక్ చేసుకోవదు..ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంబులెన్స్‌లోలో జనాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఓలా, ఉబర్ సంస్థలు కూడా క్యాబ్స్ మూసివేయాలి. నడిపిస్తే కేసులు వేస్తమని సీపీ హెచ్చరించారు. సోషల్ డిస్టెన్స్ ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు. చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు ముమ్మరం చేసినం. పిల్లల్ని కూడా ఇండ్లకే పరిమితం చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడొద్దు. నిత్యవసర సరుకులు అమ్మే షాపులైనా సాయంత్రం 7 నుంచి మూసివేయాలని ఉదయం 6 గంట నుంచి 7 గంటల వరకు షాపులు తెరవాలి. ఫుడ్ డెలివరీ ఆర్డర్లు కూడా సాయంత్రం 6 గంటలలోపే మూసివేయాలన్నారు. ప్రజలు ఊళ్ల ప్రయాణాలు మానుకోవాలని సీపీ సూచించారు.