పోలీస్‌ అధికారి కొడుకుకు కరోనా పాజిటివ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్‌ అధికారి కుమారుడికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. దీంతో అతడు కలిసిన 21 మందిని కరోనా పరీక్షల కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైరస్‌ సోకిన వ్యక్తిని కలిసిన వారిలో 16 మంది పోలీస్‌ సిబ్బంది, ఐదుగురు బంధువులు ఉన్నారు. వీరు కూడా ఇంకా ఎవరెవరిని కలిసారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షలకు వెళ్లిన పోలీసు సిబ్బందిని, బంధువులను పోలీసులు విచారించారు.