
డీజీపీ మహేందర్రెడ్డి ఈ రోజు నగరంలో పర్యటించారు. చార్మినార్ ఏరియాలో లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించారు. డీజీపీ వెంట నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఐపీఎస్ అధికారులు బాబురావు, సయ్యద్ రఫీక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ… ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలు బయటకు రాకుండా ఇండ్లలోనే ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. వాహనాలపై బయటకు వస్తే వాహనాలను సీజ్ చేసి ఫైన్ విధిస్తామని, లాక్డౌన్ ఉత్తర్వులు తొలగిన తరువాతనే వాహనాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘించిన వారికి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటూ జరిమానా కూడా ఉంటుందని చెప్పారు.