లాక్‌ డౌన్‌ కఠినంగా అమలుకు ఉత్తర్వులు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌

కరోనా వ్యాప్తి (కోవిడ్‌-19)నియంత్రణలో భాగంగా..లాక్‌ డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలకు లాక్‌ డౌన్‌ సేవల నుంచి మినహాయింపునిచ్చింది. 1897 సెక్షన్‌ ప్రకారం లాక్‌ డౌన్‌ పెట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల సరిహద్దులను మూసివేశామని తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు.
ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు 8 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా సివిల్‌ సైప్లె కమిషనర్‌, రవాణా శాఖ కమిషనర్‌, హైదరాబాద్‌ పోలీస్‌ ఐజీ, డ్రగ్‌ కంట్రోలర్‌ డైరెక్టర్‌, హార్టిక్చర్‌ డైరెక్టర్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌, లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్‌, డెయిరీ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఉండనున్నారు.
బైకుపై ఒకరు, ఫోర్‌ వీలర్స్‌పై ఇద్దరికీ మించి ప్రయాణించరాదు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదు. అత్యవసర వైద్యచికిత్స కోసం మినహా ఎవరూ బయటకు రాకూడదు. సాయంత్రం 6.30 గంటల తర్వాత అన్ని దుకాణాలు, సంస్థలు మూసివేత రాత్రి 7 గంటల తర్వాత నిత్యావసర వస్తువుల నిరాకరణ నివాస ప్రాంతం నుంచి 3 కిలో మీటర్ మేర ప్రయాణానికి అనుమతి