
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ కోటా ఉప ఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన నేపథ్యంలో ముగ్గురు బరిలో ఉన్నారు. చివరిరోజు కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన మానాల మోహన్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా సుభాష్‌రెడ్డికి బీఫాం ఇవ్వడంతో ఆయన బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్థిగా పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి.. బరిలో ఉన్నారు. వచ్చే నెల 7న పోలింగ్ నిర్వహించనున్నారు. 9న కౌంటింగ్ ఉంటుంది. ఈ ఎన్నికకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.