మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(61) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆయనతో సోమవారం రాత్రి 9 గంటలకు రాజ్‌ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన కమల్‌నాథ్‌ కూడా హాజరయ్యారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలెవరూ హాజరు కాలేదు. మధ్యప్రదేశ్‌లో నాలుగో సారి సీఎం పదవి స్వీకరించిన వ్యక్తిగా చౌహాన్‌ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు.