
విశాఖ జిల్లాలో తాజాగా సోమవారం నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరినట్లు ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకూ 181 మంది వైరస్ లక్షణాలున్న అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి ల్యాబొరేటరీలకు పంపించామని, అందులో 7 మందికి పాజిటివ్ రాగా.. 166 మందికి కరోనా లేదని వెల్లడించింది. మరో 8 కేసులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది.