
కరోనా ఎఫెక్ట్‌తో ఏప్రిల్ 4న జరగాల్సిన ఎల్‌ఐసీ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదాపడ్డాయి. ఏఏఓ, ఏఈ, ఏఏ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి 218 పోస్టులతో ఎల్‌ఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 4న జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్షలను రిక్రూట్‌మెంట్ బోర్డు వాయిదావేసింది. పరీక్షలకు సంబంధించిన తదుపరి సమాచారం కోసం అభ్యర్థులు www.licindia.in >> careers >> ఫాలో అవ్వాలని ఎల్‌ఐసీ సూచించింది. ఎల్‌ఐసీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో సివిల్, ఎలక్ట్రికల్, స్ట్రక్చురల్, ఎంఈపీ, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్స్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్) ఉద్యోగాలు ఉన్నాయి.