
ప‌్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో మొత్తం 21,116 కరోనా మరణాలు సంభవించాయి. ఇక కరోనా పాజిటివ్ కేసులు కూడా 5 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 4,65,274 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది.
కరోనా పాజిటివ్ కేసుల విషయానికి వస్తే.. 81,285 కేసులతో చైనా మొదటి స్థానంలో ఉండగా.. 74,386 కేసులతో ఇటలీ ఆ తర్వాత స్థానంలో ఉంది. ఇక మరణాల విషయంలో మాత్రం 7,503 మరణాలతో ఇటలీ మొదటి స్థానంలో ఉండగా.. చైనా 3,287 కేసులతో మూడు స్థానంలో ఉంది. 3,607 మరణాలతో స్పెయిన్ రెండో స్థానానికి వెళ్లింది. ఆ తర్వాత వెయ్యికిపైగా మరణాలు సంభించిన దేశాల్లో ఇరాన్, ఫ్రాన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఇరాన్‌లో 2,077 మరణాలు చోటుచేసుకోగా.. ఫ్రాన్స్‌లో 1,331 మంది మరణించారు.