మ‌హేష్ కోటి విరాళం

క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ప్ర‌భుత్వాలు చేస్తున్న కృషికి త‌మ వంతుగా తోడ్పాటునందించేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులంతా ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌తో పాటు ప‌లువురు ద‌ర్శ‌కులు, న‌టులు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధిల‌కు స‌హాయాన్ని అంద‌జేశారు. తాజాగా మ‌హేష్‌బాబు కోటి రూపాయ‌ల విరాళాన్ని అందించారు. క‌రోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్ర‌భుత్వాలు చ‌క్క‌టి ప్ర‌య‌త్నాల్ని చేస్తున్నాయ‌ని, ఈ పోరాటంలో త‌న వంతు భాగ‌స్వామ్యంగా తెలంగాణ‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధిల‌కు కోటి రూపాయ‌ల్ని విరాళంగా ఇస్తున్న‌ట్లు మ‌హ‌ష్‌బాబు తెలిపారు. బాధ్య‌తయుత‌మైన పౌరులుగా ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించి నియ‌మ‌నిభంద‌న‌ల్ని పాటించాల‌ని మ‌హేష్‌బాబు సూచించారు.