అటవీ ప్రాంతంలో నిప్పుపెట్టిన ఆకతాయిలు

తిరుమల జీవకోన స్థానిక నివాస అటవీ ప్రాంతంలో ఆకతాయిలు గురువారం నిప్పంటించారు. దీంతో శేషాచల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక గృహాల వరకు మంటలు రాకుండా, అటవీ ప్రాంతంలోని వాటిని అదుపు చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వెదురు మండలతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది కూడా మంటలను అదుపు చేసే పనిలో పడ్డారు. అయినప్పటికి మంటలు అదుపులోకి రావటం లేదు.