రుణ చెల్లింపుదారుల‌కు ఆర్బీఐ శుభ‌వార్త‌

రుణ చెల్లింపుదారుల‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శుభ‌వార్త‌ చెప్పారు. వ‌చ్చే మూడు నెల‌లు EMI చెల్లించ‌క‌పోయిన ప‌ర్వాలేద‌ని తెలిపారు. బ్యాంకుల‌తో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థ‌లు అన్ని ర‌కాల లోన్‌ల‌పై EMIల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాల‌ని శ‌క్తికాంత‌దాస్ సూచించారు. హౌసింగ్‌లోన్ల‌తో పాటు అన్ని ర‌కాల రుణాల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. అయితే ఇప్పుడు చెల్లించాల్సిన EMI లు త‌ర్వాత పీరియ‌డ్ లో ఎప్పుడైనా చెల్లించ‌వ‌చ్చ‌న్నారు. అటు EMI క‌ట్ట‌క‌పోయిన సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని పేర్కొన్నారు.