హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

త్వరలోనే చెత్త ఏరుకునే కుటుంబాలకు సరుకులు
లాక్‌డౌన్‌ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలను ఆదుకునేందుకు రాచకొండ పోలీసులు, ప్రజ్వల, ఎంఎస్‌ఐ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ 112 మంది హిజ్రాలకు నిత్యావసర సరకులను అందించారు. దీంతో పాటు కరోనా వైరస్‌ నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలనే అం శాలపై వారికి అవగాహన కల్పించారు. త్వరలో 600 మంది చెత్త ను సేకరించే కుటుంబాలకు కూడా నిత్యావసర సరకులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ వివరించారు. వీరందరికీ నెలసరి సరిపడే నిత్యావసర సరకులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఐ సంస్థ డైరెక్టర్‌ వర్గీస్‌థెక్‌నాథ్‌, ప్రజల్వ సంస్థ డైరెక్టర్‌ సునీత కృష్ణన్‌, తురబ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి డీమార్టు కూడా తన వంతు సహాయాన్ని అందించిందని కార్యక్రమంలో ప్రతినిధులు తెలిపారు.