
రోజురోజుకు కరోనా వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, బుగ్గన, బొత్స సత్యనారాయణ, సుచరిత, కన్నబాబులు ఉన్నారు. కరోనా దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై చర్చించడంతో పాటు ప్రతి రోజు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరాయి.