
ప్రధాని నరేంద్రమోదీ కరోనా మహమ్మారిపై యుద్ధం చేసేందుకు పీఎం సిటిజెన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఫండ్ (కేర్స్)ఫండ్స్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అసోసియేషన్ ఈ నిధికి తమ వంతుగా రూ.21 లక్షలు విరాళం ఇవ్వాలని నిర్ణయించింది. కరోనాపై పోరాటం చేసే లక్ష్యంతో ఐఏఎస్ అసోసియేషన్ సభ్యులంతా ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నామని అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.