
ఏపీలో కరోనా కేసులపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఏపీలో ఇప్పటి వరకు 528 శాంపిళ్లను పరిశీలించగా 449నెగిటివ్ వచ్చాయి. అందులో పాజిటివ్ కేసులు 19 నమోదయ్యాయి. మరో 60శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇవాళ పరిశీలించిన 16 శాంపిళ్లలో అన్ని నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇంకా రాష్ట్రంలో లాక్‌డౌన్ మరింత పటిష్టంగా అమలుచేస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని వివరించారు.