లాక్‌డౌన్‌ సమయంలో విధులను నిర్లక్ష్యం: ఇద్దరు సస్పెండ్‌

దేశవ్యాప్తంగా లాకౌడ్‌న్‌ నడుస్తున్న వేళ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సీనియర్‌ అధికారులపై వేటు పడింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆఫ్‌ ఫైనాన్స్‌లను విధుల నుంచి తొలగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు అధికారులు అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ హోం అండ్‌ లాండ్‌, బిల్డింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి, ఎస్‌డీఎమ్‌ సలీమ్‌పురా లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కోవిడ్‌ -19 విజృంభిస్తున్న సమయంలో విధి నిర్వహణలో విఫలం కావడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు నోటీసులో పేర్కొంది.