ఏపీలో మ‌రో రెండు క‌రోనా పాజిటివ్ క‌సులు

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 21కేసులు న‌మోదు కాగా ఇవ్వాళ మ‌రో రెండు పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23కి చేరుకుంది. ఈ మేర‌కు ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనాపై బులిటెన్ విడుద‌ల చేసింది. రాజ‌మండ్రిలో 72 ఏండ్ల వృద్ధుడితో పాటు, కాకినాడ‌లో 49 ఏండ్ల వ్య‌క్తికి క‌రోనా సోకింది. విశాఖజిల్లాలో 6, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4, ప్ర‌కాశం, తూర్పుగోదావ‌రి జిల్లాలో ముగ్గురు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క‌రికి చొప్పున క‌రోనా బాధిత‌ కేసులు న‌మోద‌య్యాయి. అటు విశాఖ‌, నెల్లూరు జిల్లాల నుంచి ఒక్కొక్క‌రు క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు.